News Updates



హైదరాబాద్‌: సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్‌.. నలుగురు అమ్మాయిలను ప్రేమించిన యువకుడిగా కనిపించనున్నారు. ఇందులో విజయ్‌కు జంటగా ఐశ్వర్యా రాజేశ్‌, రాఖీఖన్నా, కేథరిన్‌, ఇజబెల్లె లైట్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ‘బొగ్గుగణిలో రంగు మణిరా’ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం సోషల్‌మీడియా వేదికగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.