News Updates
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) ద్వారా రెండేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన(బీపీఈడీ) లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఈడీ) కోర్సులో ప్రవేశం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఫిజికల్‌ ఎడ్యకేషన్‌ అనుబంధ కళాశాలల్లో చేరేందుకు పీఈసెట్‌ రాయడం తప్పనిసరి.
అర్హతలు
బీపీఈడీ: డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు డిగ్రీ ఫైనల్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
డీపీఈడీ: ఇంటర్‌ ఉత్తీర్ణులతోపాటు ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం
రెండేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఈడీ) కోర్పుల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తారు. పరీక్షలో రెండు దశలు ఉంటాయి. అవి...
1.ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్టు: 400 మార్కులకు ఉంటుంది.
  పురుషులు:
ఈవెంట్     మార్కులు
100 మీటర్లు     100 మార్కులు
షాట్‌పుట్‌   100 మార్కులు
800 మీటర్ల పరుగు 100 మార్కులు
హై జంప్‌/లాంగ్‌ జంప్‌ 100 మార్కులు

  మహిళలు:
ఈవెంట్‌   మార్కులు
100 మీటర్లు   100 మార్కులు
షాట్‌పుట్‌   100 మార్కులు
400 మీటర్ల పరుగు 100 మార్కులు
హై జంప్‌/లాంగ్‌ జంప్‌ 100 మార్కులు

అభ్యర్థులు దరఖాస్తు నింపే క్రమంలోనే హైజంప్‌, లాంగ్‌ జంప్‌ల్లో ఒక్కదాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.
2.స్కిల్‌ టెస్టు ఇన్‌ గేమ్‌:
100 మార్కులకు ఉంటుంది.
బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్, క్రికెట్‌, పుట్‌బాట్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోనో, షటిల్‌ బ్యాడ్మింటన్‌, లాన్‌ టెన్నీస్‌, వాలీబాల్‌ ఆటల్లో ఏదైనా ఒక దాంట్లో అభ్యర్థి గేమ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు తమ ప్రధాన్యతా ఆటను దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 13 ఏప్రిల్‌ 2020
హాల్‌ టికెట్లు జారీ: 20 ఏప్రిల్‌
ఫిజికల్‌ టెస్టులు ప్రారంభం: మే 13
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400, ఇతరులకు రూ.800
వెబ్‌సైట్‌: https://pecet.tsche.ac.in