News Updates
లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్‌/బీఈ, బీఫార్మసీ కోర్సుల రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించే పరీక్ష... ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(ఈసెట్‌).
అర్హతలు: డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఫార్మసీ/బీఎస్‌సీ(మ్యాథ్య్‌)ఉత్తీర్ణులు ఈసెట్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ విద్యార్థులు బీఫార్మసీలో చేరేందుకు అనర్హులు.

పరీక్ష విధానం
డిప్లొమా హోల్డర్లకు: మ్యాథ్స్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఫిజిక్స్‌ 25ప్రశ్నలు-25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు-25 మార్కులు, కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
పరీక్ష వ్యవధి: మూడు గంటలు.
ఫార్మసీ అభ్యర్థులకు: ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ 50 ప్రశ్నలు-50 మార్కులకు, ఫార్మకోగ్నసి 50 ప్రశ్నలు-50 మార్కులకు, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పరీక్ష వ్యవధి: మూడు గంటలు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్లయూడీ అభ్యర్థులకు రూ.400, ఇతరులకు రూ.800
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 28 మార్చి 2020
హాల్‌ టికెట్ల జారీ ప్రారంభం: ఏప్రిల్‌ 20 నుంచి
పరీక్ష తేదీ: 2 మే 2020
వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in