News Updates



ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ టెక్నాలజీ-మద్రాస్‌ తన డిజిటల్‌ స్కిల్‌ అకాడమీ ఆధ్వర్యంలో మహిళలకు పలు స్వల్పకాలిక సాంకేతిక కోర్సులను (బేసిక్‌ అండ్‌ అడ్వాన్స్డ్‌) ప్రారంభించింది. ^^కెరీర్‌ బ్యాక్‌ 2 ఉమెన్‌(సిబి 2 ఉమెన్‌)^^ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ నైపుణ్య శిక్షణ ప్రొగ్రామ్స్‌ మహిళ ఉద్యోగ ప్రగతికి దోహదం చేస్తాయి. ఐఐటి మద్రాస్‌ డిజిటల్‌ స్కిల్స్‌ అకాడమీ ఫోరెన్సిక్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ టెక్నాలజీస్‌(ఫిస్ట్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది.
సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ బేసిక్స్‌/అడ్వాన్స్డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/ మెషీన్‌ లెర్నింగ్‌
(AVML): ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో నిపుణులను తయారు చేసేందుకు ఉద్దేశించిన కోర్పులు ఇవి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మహిళా ఐటీ నిపుణులు, ఇంజనీర్లు, సైంటిస్టులు మరింత మెరుగైన విజ్ఙానం పొందేందుకు, నైపుణ్యం సంపాదించేందుకు ఈ కోర్సు దోహదం చేస్తుంది.
అర్హతలు/కాల వ్వవధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ/డిప్లొమా(10+2+3) పాసైన వారు అర్హులు. 10 వారాల కాలవ్యాధి గల ఈ కోర్సు ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 28 వరకు సాగుతుంది. కోర్సు ఫీజు రూ.41,300. 20 వారాల అడ్వాన్స్డ్‌ కోర్సు ఫీజు రూ,59,000. నవంబర్‌ 29 వరకు కొనసాగుతుంది.
సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ బ్యాక్‌ టు టెక్నికల్‌ ట్రాక్‌ (BTCUBE): ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ వ్యక్తి గత కారణాల వల్ల ఉద్యోగాన్ని వదిలేసిన మహిళా నిపుణులకు ఉద్దేశించిన కోర్సు ఇది. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నవారికి ఎంచుకున్న స్ఫెషలైజేషన్‌లో శిక్షణనిస్తారు. గత పదేళ్లలో ఐటీ పరిశ్రమలో జరుగుతున్న సంఘలనలపై పూర్తి అవగాహన, శిక్షణ ఇస్తారు. కొత్త లాంగ్వేజెస్‌, టెక్నాలజీ, నెట్‌వరకింగ్‌ అండ్‌ సెక్యూరిటీ వంటివి ఇందులో ఉంటాయి.
ఫీజు/కాల వ్వవధి: నాలుగు వారాల వ్వవధి గల ఈ కోర్సు ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. కోర్సు ఫీజు రూ,17,700.
సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ బిగ్‌ డేటా అనాలసిస్‌: డేటాసైన్స్‌ నేర్చుకోవాలనే ఆసక్తి గలవారి కోసం డిజైన్‌ చేశారు. డేటా అనలిటిక్స్‌ సమస్యలు, సవాళ్లను ఎలా ఎవుర్కొవాలో ఈ కోర్సు ద్వారా శిక్షణనిస్తారు. బిగ్‌ డేటా వినియోగం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు.
అర్హతలు/కాల వ్వవధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ/డిప్లొమా(10+2+3) పాసైన అభ్యర్థులు అర్హులు. పది వారాల కాలవ్యవధి గల బేసిక్‌ కోర్సు ఏప్రిల్‌ 1 నుంచి జూలై 28 వరకు సాగుతుంది. కోర్సు ఫీజు రూ.41,300. అయితే, 20 వారాల ^^సర్టిఫడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ అడ్వాన్స్డ్‌ కోర్సు ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ బిగ్‌ డేటా అనాలసిస్‌^^ ఫీజు రూ.59,000.
వివరాలకు https://skillsacademy.iitm.ac.in