News Updates1. ఎస్‌ఈసీ కేవియట్‌ ఎందుకు వేసింది: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ చర్చించారా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖకు లేఖరాయడమేంటని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని సీఎం హెచ్చరించినట్లు ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు..ఆయన వద్ద ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు.

2. భారత్‌లో కరోనా బాధితులు @ 271

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు ఉయదం 10గంటల సమయానికి దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఇప్పటివరకు 14811 మంది నుంచి 15701 శాంపిల్స్‌ను పరీక్షించి వారిలో 271 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొంది.

3. ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనానై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.

4. ఇటలీలో ఒక్కరోజే 627 కరోనా మరణాలు..

ప్రపంచంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇక కొత్తగా సోకుతున్న వారి సంఖ్య అదుపులో లేకుండా పోతోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే దేశాలన్నీ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇటలీలో తీవ్రత మరింత ఎక్కువైంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 627 మంది మహమ్మారికి బలైపోయారు.

5. ‘సార్క్‌ తరఫున భారత్‌ గొప్ప ముందడుగు’

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సార్క్‌ దేశాలతో కలిసి భారత్‌ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ శుక్రవారం టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. ఇందులో భాగంగా ఇద్దరు నాయకులు కొవిడ్‌ మహమ్మారి గురించి చర్చించినట్లు ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కరోనా విషయంలో పరస్పరం భాగస్వామ్యంతో కట్టడికి కృషి చేయాలని ఇరువురు నేతలు చర్చించారు.

6. కరోనా ఎఫెక్ట్‌: ఉబర్‌, ఓలాలో షేరింగ్‌ లేదు

దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలు ఓలా, ఉబర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలకు అనుసరిస్తూ ‘పూల్‌ రైడ్‌’ లేదా ‘పూల్‌ సర్వీస్‌’ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇకపై ఓలా లేదా ఉబర్‌లో ఒకరు లేదా ఒకే కుటుంబానికి చెందినవారు మాత్రమే ప్రయాణించవచ్చు. గతకొన్ని రోజులుగా ‘పూల్‌ సర్వీస్‌’కు డిమాండ్‌ బాగా తగ్గిపోయిందని సంస్థలు తెలిపాయి.

7. వైరస్‌కు యువత అతీతమేం కాదు: డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ యువత మీద పెద్దగా ప్రమాదం చూపదన్న వాదన ప్రచారంలో ఉంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ మాత్రం యువకులు కూడా అప్రమత్తంగా ఉండల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వైరస్‌ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో వృద్ధులే మరణించడం వల్ల ఇలాంటి భావన ఏర్పడిందని తెలిపారు. కానీ, వైరస్‌కు యువకులు అతీతులేం కాదని స్పష్టం చేశారు.

8. పాక్‌ బ్యాట్స్‌మన్‌పై జీవితకాల నిషేధం?

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున అతడికి నోటీసులు జారీ చేసింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

9. వర్మ మేధావి: ఇషా కొప్పికర్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక మేధావి అని అంటున్నారు నటి ఇషా కొప్పికర్‌. 2002లో వర్మ దర్శకత్వం వహించిన ‘కంపెనీ’ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంతో గుర్తింపు తెచ్చుకున్న ఇషా తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ కోసం ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇషా కొప్పికర్‌ మాట్లాడుతూ.. ‘వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ చాలా వరకూ పూర్తయ్యింది. ఆర్జీవీ సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు నలుగురు దర్శకత్వం వహిస్తున్నారు