News Updates



ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ప్రారంభంలోనే బలహీనపడిన మార్కెట్లు ఒక దశలో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 30, 690 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 8,994 వద్ద క్లోజ్ అయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 76.72గా ఉన్నది. ఫైనాన్షియల్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగ నష్టాలను మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఫార్మ, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టపోగా..హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి.