News Updates



హైదరాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) జరుగుతుందా లేదా అనే సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది. దీంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​) 13వ సీజన్ నిరవధిక వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మార్చి 29 నుంచి ఈ నెల 15కు సీజన్ వాయిదా పడింది.

^^ఐపీఎల్‌ 2020 భవితవ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. కోవిడ్ -19 సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. మే 3 తర్వాత మాత్రమే పరిస్థితిని బీసీసీఐ సమీక్షిస్తుందని^^ బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఐపీఎల్ రద్దు చేస్తే రూ.3వేల కోట్ల దాకా నష్టం వస్తుందని, ఈ సమస్యకు పరిష్కారం కోసం భాగస్వాములందరితో బోర్డు చర్చిస్తుందని తెలిపారు.