News Updates



ఆలా మొదలైంది, 180 , ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్..గీత గోవిందం చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటించి ఇంకాస్త దగ్గరయింది. ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు. ^^ది ఐరన్ లేడీ^^ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జయలిలత పాత్రను పోషిస్తుంది. ఈ మధ్యనే ఈమె తాలూకా ఫస్ట్‌లుక్ విడుదలై అంచనాలు పెంచింది.

మొదటి నుండి కూడా నిత్యా హాట్ షూట్స్ కు అలాగే ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. జె ఎఫ్ డబ్య్లూ మ్యాగజైన్ కోసం కాస్త హాట్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ఈ పిక్స్ చూసి అభిమానులు చాలామంది నిత్యా ఇలా కూడా ఉంటుందా అని కామెంట్స్ వేస్తున్నారు.