News Updatesటీంఇండియా తమతో ఆడాలని భావించకపోతే...తాము కూడా భారత్ లేకుండానే ప్రణాళికలు సిద్దం చేసుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఈ మేరకు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ స్పష్టం చేశాడు. గతంలో భారత్ తమతో ఆడతామని..రెండు, మూడు సార్లు చెప్పినప్పటకీ... చివరికి తమ నిర్ణయం మార్చుకుందన్నారు. రాజకీయాలు, క్రీడలను వేరుగా చూడాలని ఈ సందర్భంగా ఎహ్సాన్ చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రనష్టాల్లో ఉందని చెప్పిన ఆయన..తమ మనుగడకు భారత్ అవసరం లేదని తెలిపాడు. బోర్డును లాభాల్లోకి తెచ్చేందుకు సరైన ప్రణాళికలు సిద్దం చేసుకుంటామన్నాడు.