News Updates



కరోనా వైరస్‌ ప్రభావం అందరిపై తీవ్రప్రభాలం చూపుతోంది. ఇంటికే పరిమితమైనప్పటికీ వైరస్‌ బారిన పడుతున్నవారు ఉన్నారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎక్కువగా నివాసం ఉండే ముంబైలోని అంధేరిలోని ఒక కాంప్లెక్ట్‌లో కరోనా కలకలం రేగింది. బాలీవుడ్‌ హీరోలు విక్కీ కౌశల్‌, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు దర్శకులు ఇక్కడ నివసిస్తుంటారు. తాజాగా ఓ దర్శకుని కుమార్తెకు కరోనా సోకిందని తెలిసింది. దాంతో ఆఘమేఘాలపై కాంప్లెక్స్‌ను శుభ్రపరిచారు. నివాసితులు అందరూ తమ ఫ్లాట్స్‌కే పరిమితమయ్యారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారు.