News Updates



ఆదిలాబాద్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అత్తాకోడళ్లు చికిత్సపొందుతూ మృతి చెందారు.
బుధవారం జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్టి వద్ద నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు గోదుమల లోడ్‌తో వెళ్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇచ్చోడ మండలం ఇస్లాంపురా కాలనీకి చెందిన నజీముద్దీన్‌, తల్లి అప్సరాబేగం, భార్య రేష్మాబేగం, కొడుకు అర్ఫాన్‌కు గాయాలయ్యాయి. వీరిని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి అప్సరాబేగం బుధవారమే చనిపోగా, గురువారం ఆమె కొడలు రేష్మాబేగం మృతి చెందింది. అత్తాకోడళ్ల మృతితో ఇస్లాంపురాలో విషాదం నెలకొంది.