News Updatesనోయిడా: తొమ్మిదేండ్ల క్రితం ఢిల్లీలో నిర్భయపై కదులుతున్న బస్సులో సామూహిక లైంగిక దాడి విషయం ఇంకా మరవక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్‌ బస్సులో ప్రయాణిస్తున్న 25 ఏండ్ల మహిళపై బస్సు డ్రైవర్లు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బుధవారం వేకువజామున లక్నో-మధుర జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
ఘటన జరిగిన సమయంలో బస్సులో పన్నెండు మంది వరకు ఉన్నారని, బస్సు చివరి సీటులో తన ఇద్దరు పిల్లలతో కూర్చున్న బాధితురాలిని నిందితులు బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.