News Updatesవిశాఖ: విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి వద్ద గురువారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఓ లారీలో తరలిస్తున్న 940 కిలోల గంజాయి పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా గంజాయిని పెద్దఎత్తున తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్‌ అధికారులు పలు ప్రాంతాల్లో విస్తృత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లాలోని తిరుచునూర్‌ పట్టణం రాంచంద్రపురం కూడలి వద్ద తనిఖీలు నిర్వహించగా పనస పండ్ల లారీలో 500 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు.