News Updates



లాస్ఏంజెల్స్‌: ^^దట్ సెవంటీస్ షో^^ నటుడు డానీ మాస్టర్‌సన్ కటకటాల వెనక్కి వెళ్లాడు. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను బుధవారం లాస్ ఏంజెల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగా డానీ మాస్టర్‌సన్‌పై ముగ్గురు యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2001లో 23 ఏళ్ల యువతిని, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు... కేసులు నమోదు అయ్యాయి. వీటిపై పోలీసులు మూడేళ్లుగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  తాజాగా విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ఆయనకు జైలు శిక్ష విధించింది. అయితే కొద్ది గంట‌ల్లోనే డానీ మాస్ట‌ర్‌స‌న్ కోర్టుకు 3.3 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించి జైలు నుంచి విడుద‌ల‌య్యాడు.